06-07-2025 12:00:00 AM
చర్మం మెరవాలంటే కేర్ తీసుకోవాల్సిందే. అందుకు ఖరీదైన క్రీములు, లోషన్లు, స్క్రబ్‌లు వాడాల్సిందే అనుకుంటాం కదా. ఓసారి డ్రై బ్రషింగ్‌నీ ప్రయత్నించమంటున్నారు నిపుణులు.
ముఖం అందంగా ఉంటే చాలా? శరీరమంతా ఆరోగ్యంగా కనిపించాలనుకునే రోజులివి. రసాయనాలున్న ఉత్పత్తులను వాడే బదులు సహజ మెరుపు తీసుకొచ్చే ప్రయత్నమే డ్రై బ్రషింగ్. దీనికి కేటాయించేదీ మూడు నిమిషాలే. యూరోపియన్ రాయల్స్ నుంచి వచ్చిన ఈ ప్రక్రియలో ఏం చేయాలంటే.. బ్రష్ తీసుకుని పాదాల నుంచి మెడ వరకు వృత్తాకారంలో రుద్దుకుంటూ రావడమే. ఇందుకు ప్రత్యేకమైన బ్రష్‌లు మార్కెట్‌లో దొరుకుతాయి.
వాటినే ఉపయోగించాలి. మరీ ఒత్తిడి పెట్టకూడదు. మృదువుగా రుద్దుకుంటూ రావాలి. ఈ డ్రై బ్రషింగ్ పూర్తయ్యాక స్నానం చేసి, శరీరానికి పోషకాలున్న నూనెల్ని కానీ, మాయిశ్చరైజర్ కానీ రాస్తే మేలు. ఈవిధంగా చేయడం వల్ల మృతకణాలు తొలగడమే కాదు. రక్తప్రసరణ మెరుగవుతుంది. కణాల పునరుద్ధరణా జరిగి సహజ మెరుపు సాధ్యమవుతుంది. ముఖానికి ప్రత్యేకమైన బ్రష్‌లుంటాయి. వీలుంటే వాటిని వాడండి. లేదంటే వదిలేయడమే మేలు.