‘500 కోట్లు ఇవ్వండి’
రాజేంద్రనగర్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బోధన,బోధనేతర ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా లను కలిసి పలు అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు.
కళాశాల భవనాల నిర్మాణం, నిర్వహణ, విద్యార్థులకు వసతిగృ హాల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. ప్రస్తుతం విద్యార్థుల కు సరిపడా వసతి గృ హాలు లేకపోవడం వల్ల గెస్ట్ హౌస్ లలో వస తి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బోధన, బోధనేతర ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేయా లని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రం సమర్పించారు.
ఈ అంశంపై జనవరి 5వ తేదీన సమావేశం నిర్వహిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.




