01-01-2026 12:35:53 AM
వన సంరక్షణ సమితి బృందాల ఆర్థికాభివృద్ధి కి చర్యలు
వన సంరక్షణ సమితి సమావేశ మందిరాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, డిసెంబర్ 31(విజయ క్రాంతి): వన సంరక్షణ సమితితో అటవీ సంరక్షణ, అభివృద్ధికి అటవీ శాఖకు చక్కటి సహకారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో నిర్మించిన వన సంరక్షణ సమితి సమావేశ మందిరాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వన సం రక్షణ సమితిని ప్రోత్సహిస్తే, అడవికి మంచి జరుగుతుందని అన్నారు.
కనకగిరి, పులిగుండాల తదితర అటవీ ప్రాంతాల్లో 4 నుండి 5 వన సంరక్షణ సమితులు క్రియాశీలకంగా ప నిచేస్తున్నట్లు ఆయన అన్నారు. ఇందులో నుండి గుర్తించిన ఒక సమితిని పైలట్ ప్రా జెక్ట్ గా తీసుకొని వారిని ఆర్థికంగా ప్రోత్సహించడానికి రూ. 20 లక్షలు మంజూరు చే స్తున్నట్లు తెలిపారు. విదేశాలకు విహారాలకు కోట్లు పెట్టి వెళతారని, మన చుట్టూ విహారానికి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో పులిగుండాల, కనకగిరి హిల్స్ సుమారు 35 వేల ఎకరాలకు ఒకే బిట్ గా అటవీ ప్రాంతం విస్తరించివుందని తెలిపారు. ఈ ప్రాంతం ఎంతో బాగుందని, విదేశాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల రేంజ్ లో వీటిని తీర్చిదిద్దే అవకాశం ఉందని అన్నారు.
అడవులను రక్షించుకుంటూ, వన్యప్రాణులను కాపాడుకుంటూ, వినోదానికి, గిరిజనులకు ఉపయోగ పడి, లబ్ది కలిగే విధంగా ప్రోత్సహిస్తూ ప్రణాళిక చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కార్యాచరణకు కావాల్సిన నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అటవీ పరిరక్షణ చాలా అవసరమని, అటవీ పరిరక్షణలో పౌరులుగా మన అందరిపై బాధ్యత ఉందని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, అడవులు, చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతో అవస రమన్నారు. చెట్ల పెంపకం, వన సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పులిగుండాల, కనకగిరి హిల్స్ ప్రాంతాలను ప్రోత్సహించి అభివృద్ధి చేస్తే, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఆదాయంతో పాటు ఉపాధి లభి స్తుందని తెలిపారు. అంతకుముందు మంత్రి పులిగుండాల ఎకో టూరిజం విహారానికి రెండు వాహనాలను ప్రారంభించారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారిచే ఉచి తంగా పంపిణీ జ్యుస్, సబ్బులు, విస్తరాకులు తయారీ యూనిట్లను వన సంరక్షణ సమితిలకు అందజేశారు. వన సంరక్షణ సమితి సభ్యులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, ఎఫ్ డిఓ మంజుల, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నీరజ ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.