23 May, 2026 | 6:01 AM

విజిలెన్స్ పవర్ మాకివ్వండి!

20-04-2024 12:09 AM

l హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ వినతి?

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పని చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం తమకు విజిలెన్స్ పవర్ కేటాయించాలని ఆ సంస్థ కమిష నర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌కు ఇటీవల వినతి పెట్టుకున్నట్లు సమా చారం. దీనిపై పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత క్లారిటీ రానుంది. కొత్త ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు ప్రాధాన్యం ఇస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే ఏడు జిల్లాల పరిధిలో హెచ్‌ఎండీఏ విలువైన భూములు ఉన్నాయి. అన్యాక్రాంతమవుతున్న ఆ భూములను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్య లు తీసుకోవాలని ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులతో నిర్వహించిన సమా వేశంలో సీఎం రేవంత్ సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే  హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భూముల లెక్కలు తీయాలని సీఎం ఆదేశించడంతో ఆ సంస్థ అధికారులు 8,347 ఎకరాల ను గుర్తించారు. మరికొన్ని చోట్ల 200 గజాల నుంచి ఎకరాల్లో భూమి ఉన్నట్లు తేలింది. ఈ భూముల పరిరక్షణకు మొత్తం ఏడుగురు అధికారులను సైట్ ఆఫీసర్లుగా నియమించి తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎస్టేట్ అధికారులకు సమాచారం ఇచ్చేలా వ్యవస్థను నడిపిస్తున్నారు. ఎక్కడైనా అన్యాక్రాంతమవుతున్న భూమి పరిరక్షణ, చర్యలకు సంబంధించి ఎస్టేట్ ఆఫీసర్ జోక్యం లేకుండా నేరుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికే బాధ్యతలు కల్పించాలని కమిషనర్‌కు విన్నవించినట్టు సమాచారం. హెచ్‌ఎండీ ఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఒక డీఎస్పీతో పాటు ఒక సీఐ, మరొక ఎస్‌ఐతోపాటు మరో 40 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.