మతిస్థిమితం లేకుండా ‘పొన్నం’ వ్యాఖ్యలు
20-04-2024 12:11 AM
l ఆయన కోసం పిచ్చాసుపత్రి ఏర్పాటు చేయండి
l బండి సంజయ్‌కి మాజీ సర్పంచ్‌ల వినతి
కరీంనగర్, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన కోసం హుస్నాబాద్ లో పిచ్చాసుపత్రి ఏర్పాటు చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌లు శుక్రవారం కరీంనగర్‌కు వచ్చి ఎంపీ బండి సంజయ్‌కి వినతి పత్రం అందించారు. తమ నియోజకవర్గానికి మంత్రి పొన్నం వచ్చి రాయలేని భాషలో బూతులు వాడుతున్నారని, సొంతపార్టీ నేతలపైనా ఇదే భాష వినియోగిస్తున్నారన్నారు. పొన్నం కోసం కరీంనగర్ జిల్లాలో పిచ్చాసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.






