calender_icon.png 2 May, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్ల బండ్లకి దారివ్వండి

02-05-2025 12:53:12 AM

రైల్వే అధికారులను కోరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి 

గద్వాల, మే 1 ( విజయక్రాంతి ) : గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల పరిధిలోని జాంపల్లి గ్రామంలో రైతులు తమ వ్యవసాయ భూములలోకి రైతులు వెళ్ళడానికి  రైల్వే అధికారులు నిరాకరించడంతో రైతులందరు కలిసి గురువారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ని ఆశ్రహించారు. 

స్పందించిన ఎమ్మెల్యే  జాంపల్లి గ్రామాన్ని  చేరుకొని రైల్వే ట్రాక్ ను పరిశీలించి, రైల్వే ట్రాక్ వెంబడి దాదాపు రెండు వేల ఎకరాల  వ్యవసాయ క్షేత్రలకు రైతులు తమ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో వెళ్ళడాన్ని రైల్వే అధికారులు నిరకరించడం సరైంది కాదని రైల్వే ఉన్నత అధికారులతో మాట్లాడి రైతుల  పట్ల న్యాయంగా వ్యవహారించాలని రైతులను తమ వ్యవసాయ క్షేత్రాకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలు చేయవద్దని కోరారు. 

రైల్వే అధికారులు స్పందిస్తూ రైతులకు  ఎటువంటి ఇబ్బంది కలగకుండ ప్రత్యేక దారిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలొ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, జాంపల్లి గ్రామస్తులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.