02-05-2025 12:48:10 AM
వేసవి సెలవుల్లోనూ శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో క్లాసులు
‘సార్.. మేము మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాం.. మాకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంలేదు. హాలిడేస్‌లోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ సార్’ అంటూ ఓ విద్యార్థి విద్యాశాఖ ఉన్నతాధికా రికి ఫోన్‌చేసి ఆవేదనను వ్యక్తంచేశారు. ఓ కార్పొ రేట్ కాలేజీ అని ఆ విద్యార్థి చెబుతున్నది నారా యణ, చైతన్య కాలేజీల గురించే.. ఇది ఆ ఒక్క విద్యార్థి గోస కాదు, వేసవి సెలవుల్లో కాలేజీల ప్రధాన ద్వారాలు మూసి నిర్బంధంగా చదువులు చెబుతున్న కాలేజీల్లోని వందలాది విద్యార్థుల మనోవేదన.
నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. అదీ బహిరంగంగానే. దీనిని బట్టి విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకో వచ్చు. చదువుల పేరుతో విద్యార్థులపై ఆ కాలే జీలు మోయలేనంత భారాన్ని మోపుతున్నాయి. మాకు కావాల్సింది ర్యాంకులే అన్నట్లుగా ఆ కార్పొరేట్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. నారా యణ, శ్రీచైతన్య కాలేజీలు ర్యాంకుల దాహంతో విద్యార్థులను బలిచేస్తున్నాయని విద్యార్థి సంఘా లు ఆరోపిస్తున్నాయి.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాల్సిన క్లాసులను చాలా కాలేజీలు ఉదయం 6 నుంచి మొదలుపెడుతు న్నాయి. కేవలం వేసవి సెలవుల్లోనే కాదు.. సంక్రాంతి, దసరా లాంటి పండుగ సెలవు ల్లో తరగతులు నిర్వహించకూడదన్న ఇంటర్ బోర్డు హెచ్చరికలను కళాశాలలు బేఖాతరు చేస్తున్నాయి.
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): మార్చి 30 నుంచి జూన్ 1 వరకు జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2025 విద్యాసంవత్సరానికి తరగతులను జూన్ 2 నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.
మే 1 నుంచి ఫస్ట్ ఫేజ్ ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించి, మే 31 వరకు కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత జూన్ 2 నుంచి కొత్త విద్యా సంవ త్సరానికి తరగతులు ప్రారంభించాలి. కానీ శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు ఏప్రిల్లోనే తరగతులు ప్రారంభించేశాయి.
ఫస్టియర్‌కు అడ్మిషన్లు చేపట్టి తరగతులను నిర్వహిస్తున్నాయి. అడ్మిషన్ల ఖరారు కోసం కొన్ని కాలేజీలు రూ.10,500, ఇం కొన్ని కాలేజీలు రూ.15,500 టోకెన్ అమౌంట్ కట్టించుకొని తరగతులను నిర్వహిస్తున్నాయి. పదో తరగతి ఫలితాలు రాకముందే ఫస్టియర్‌లో జాయిన్ అయిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు, బేసి క్స్, ముందస్తు తరగతులంటూ క్లాసులు నిర్వహిస్తుంటే, ఫస్టియర్ పూర్తిచేసుకొని సెకండియర్‌లో అడుగుపెడుతున్న వారికి ఇంటర్ సిలబస్, జేఈఈ, నీట్, ఎప్‌సెట్ లాంటి వాటికి తరగతులను నిర్వహిస్తున్నారు.
వేసవి సెలవుల్లోనే కాదు.. సంక్రాంతి, దసరా లాంటి పం డుగ సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదన్న ఇంటర్ బోర్డు హెచ్చరికలను కళా శాలలు బేఖాతరు చేస్తున్నాయి.
రాత్రివరకు రుద్దుడే..
విద్యాసంవత్సరం ప్రారంభం కాక ముందే క్లాసులను నిర్వహిస్తున్నారు. ఉద యం ఎనిమిది తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగైదు గంటల వరకు వేసవిలో క్లాసులను నిర్వహిస్తున్నారని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అదే అకడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత ఉదయం నాలుగైదు గంటలకు నిద్రలేపి రాత్రి పది...పదకొండు గంటల వరకు స్టడీ హవర్స్, క్లాసుల పేరుతో చదివిస్తున్నారని ఆ రోపణలున్నాయి. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల తీరు గురించి సోషల్ మీడియాల్లో విద్యార్థులు పెట్టిన అనేక వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.
శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే ఎక్కువ
రాష్ర్టంలో 200 నుంచి 250 వరకు ఇం టర్ కార్పొరేట్ కాలేజీలున్నాయి. వీటిలో మె జార్టీగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల్లోనే ఉన్నాయి. వీటిల్లోనూ అత్యధికంగా శ్రీచైత న్య, నారాయణ కాలేజీలే ఎక్కు వ. వీధికో కాలేజీలుగా ఈ కార్పొరేట్ కాలేజీలు తయారయ్యాయి. ఒక్కోగదిలో 40 లేదా 50 మం ది విద్యార్థులు ఉండాలి. హాస్టల్‌లో రూము ను బట్టి నలుగురు ఐదుగురు ఉండాలి. కానీ అడ్మిషన్లు తీసుకునేటప్పటికి.. ఆతర్వాత తరగతి గదుల్లో ఉండే విద్యార్థుల సంఖ్యకు పొంతనే ఉండదనే విమర్శలున్నాయి.
విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి: కే మణికంఠ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహించొద్దు. విద్యార్థులకు మానసిక ప్రశాంతతను ఇవ్వాలి. ఒ త్తిడి పెంచొద్దు. కానీ శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు నిర్వహి స్తున్నా యి. ఎంతో మంది విద్యార్థులు తమకు ఫో న్టు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. అధికారు లు మాత్రం పట్టించుకోవడంలేదు.