calender_icon.png 2 May, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం

02-05-2025 12:55:15 AM

 కడ్తాల్, మే 1 : కడ్తాల్ మండల కేంద్రం లో కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్లమెంట్ లోని కాంగ్రెస్ పక్ష ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పాటానికి ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి  పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో అన్ని అన్నీ రాష్ట్రాలలో జనగణన లో కులగణన చేసి ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నదో తేల్చి ఆయా వర్గాలకు సామాన అవకాశాలు కల్పించాలని ముఖ్యంగా  విద్య, ఉద్యోగ, ఉపాధి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆర్థికంగా దేశ రాష్ట్ర బడ్జెట్లలో తగిన వాటా ఇచ్చి దేశంలో అందర్నీ సరి సమానంగా చూడాలని ఎవరెంతో వారికంత అనే నినాదం తో ప్రజల కలలు సాకరం చేసి నెరవేరుస్తానని ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే  మనమంతా సమానమే అనే నినాదం తో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర చేపట్టి ఆయా రాష్ట్రంలో దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్లమెంట్లో మెజార్టీ రాగానే ఈ దేశంలో కులగనణ లు వేసి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది .

ప్రాంతీయ వాదనలతో పాటు దేశ సామజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి గొప్ప ప్రయత్నం అని దేశ భవిష్యత్ అభివృద్ధి బాట పడుతుందని అయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తెలంగాణలో గెలిస్తే కులగణన చేసి అందులో ఏ ఏ సామాజిక వర్గం ఏ కులం ఎంతుందో తెలిసి అందరికీ న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా బీసీలకు తగు న్యాయం జరిగేలా కాంగ్రెస్ కృషి చెసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ ముదిరాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి నేనావత్ బీక్యా నాయక్, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభావత్ బీచ్యా  నాయక్, అమనగల్ అధ్యక్షులు జగన్, మార్కెట్ డైరెక్టర్ అజీమ్, రామకృష్ణ, జవహర్లాల్, లక్ష్మణ్ నాయక్, హీర సింగ్ నాయక్, యాదయ్య, బాలరాజ్, రామచందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.