23-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): నగరంలోని కాచిగూడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త, ఆయన భార్యకు మత్తుమందు కలిపిన ఆహారాన్నిచ్చి 2 కిలోల బంగారం, రూ.3 కోట్ల నగదుతో పరారయ్యారు ఆ ఇంటి పనిమనుషులు. కాచిగూడ లింగంపల్లిలోని ఓ పారిశ్రామికవేత్త వారం రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులను ఇంటి పనికి నియమిం చుకున్నారు.
వేసవి నేపథ్యం లో ఆ వ్యాపారి కుమారుడు, కోడ లు విదేశీ యాత్రకు వెళ్లగా.. సదరు వ్యాపారి ఆయన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి యజమానులు తినే భోజనంలో నేపాల్ దంపతులు మత్తుమందు కలిపారు. ఇద్ద రూ మత్తులోకి జారుకున్నాక ఇం ట్లోని 2 కిలోల బంగారు ఆభరణాలు, రూ.3 కోట్ల నగదుతో పని మనుషులు పరారయ్యారు.
ప్రతీ రోజు ఉదయం వాకింగ్‌కు వచ్చే సదరు వ్యాపారవేత్త సోమవారం నాడు రాకపోవడంతో ఆయన స్నేహితులు వెళ్లి తలుపు తీశారు. అప్పటికే నిద్రమత్తులో ఉన్న బాధితుడు తలుపు తీశాడు. దీంతో దొంగతనం జరిగిన విషయం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.