calender_icon.png 9 May, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ సీఎంకి ప్రధాని మోదీ ఫోన్

09-05-2025 01:51:17 PM

న్యూఢిల్లీ: ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌(Gujarat Chief Minister Bhupendra Patel)ను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం అప్రమత్తం చేశారు. సరిహద్దు వెంబడి పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దు భద్రత చర్యలపై ప్రధాని మోదీ చర్చించారని గుజరాత్ సీఎం తెలిపారు.

సరిహద్దు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ప్రధాని మోదీ వివరించారని భూపేంద్ర పటేల్‌ వెల్లడించారు. సున్నిత జిల్లాల్లో చేపట్టిన చర్యల గురించి ప్రధాని ఆరా తీశారని గుజరాత్ సీఎం స్పష్టం చేశారు. కొనసాగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలపై ఆయన తాజా సమాచారం కోరారని చెప్పారు. బనస్కాంత, పటాన్, కచ్, జామ్‌నగర్ సరిహద్దు జిల్లాలలోని పౌరుల పరిస్థితిని కూడా ప్రధాని మోదీ సమీక్షించారు. పాకిస్థాన్ తో గుజరాత్  అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది. అటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలతో కేంద్ర హోంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సమావేశం అయ్యారు. సరిహద్దు వద్ద పరిస్థితులపై కేంద్రమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.