calender_icon.png 10 May, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే వేదికపై ఘనంగా సీతారామ ఉమామహేశ్వర కళ్యాణం

22-04-2025 11:10:48 PM

గజ్వేల్: 8 శతాబ్దలకు పైగా పురాతనమైన గజ్వేల్ పట్టణంలోని సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారామ ఉమామహేశ్వర దేవతామూర్తుల కళ్యాణం ఒకే వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఈవో శశిధర్, ధర్మకర్తలు కాల్వ శ్రీధర్ రావు తదితరులతో నాతగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుండి సుధాకర్ దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు అందజేశారు. కళ్యాణ్ ఉత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్సీ రాజమౌళి గాడిపల్లి భాస్కర్, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, డాక్టర్ నరేష్ బాబు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.