calender_icon.png 9 May, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సైనికులారా.. మీ వెంటే మేముంటాం

09-05-2025 01:55:32 PM

ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం 

మానుకోటలో భారీ ర్యాలీ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): భారత సైనికులారా.. మీ వెంటే మేముంటాం.. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దాం అంటూ నినదిస్తూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో జర్నలిస్టులు ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. టీయూడబ్ల్యూజే 143 ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(Mahabubabad MLA Bhukya Murali Naik) పాల్గొని, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సంఘటితంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి ఉపేంద్రం, రఘు, రామకృష్ణారెడ్డి, రాజు, గుట్టయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.