5 July, 2026 | 4:01 PM

గో డిజిట్ ఐపీవోకు 10 రెట్లు స్పందన

18-05-2024 12:05 AM

ముంబై, మే 17: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మలకు పెట్టుబడులు ఉన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ముగింపు రోజైన శుక్రవారం 9,60 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది.  ఐపీవోలో 5.28 కోట్ల షేర్లను కంపెనీ జారీచేస్తుండగా, 50.70 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ.2,615 కోట్ల సమీకరణకు వచ్చిన ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,125 కోట్ల విలువైన 4.14 కోట్ల షేర్లను తాజా ఈక్విటీగా జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.1,489 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. ఐపీవో ధరల శ్రేణిని రూ.258 నిర్ణయించారు. రిటైల్ విభాగంలో 4.27 రెట్లు స్పందన లభించగా, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల విభాగంలో 5.15 రెట్లు షేర్లకు బిడ్స్ వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం భారీగా 12.76 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది.