21 August, 2026 | 12:25 AM

జీవో 97ను రద్దు చేయాల్సిందే

21-08-2026 12:23 AM
  1. పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్
  2. పలుచోట్ల ఆందోళనలు
  3. విజయవాడ హైవేపై బైఠాయింపు
  4. లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు 
  5. మాసాబ్‌ట్యాంక్ కాలేజీలో ధర్నా
  6. విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు
  7. యూసుఫ్‌గూడ ప్రభుత్వ మహిళా కాలేజీ వద్ద నిరసన 

జూబ్లీహిల్స్/అబ్దుల్లాపూర్‌మెట్/బడంగ్‌పేట్, అగస్టు 20 (విజయక్రాంతి): జీవో నంబర్ 97 (శక్తి స్కీమ్)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ వి ద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ మండలం విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మె ట్ వద్ద విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛా ర్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు.

పలువురికి గాయాలు కాగా, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్, మీర్‌పేట్  ప్రాంతాల్లోని కళాశాలల బంద్ విజయవంతమైంది. మాసాబ్ ట్యాంకులోని పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి బీఆర్‌ఎస్వీతోపాటు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలి పాయి. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

పాలిటెక్నిక్ నిర్వీర్యానికి కుట్ర: ఏఐడీఎస్‌ఓ

పాలిటెక్నిక్ విద్య నిర్వీర్యానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏఐడీఎస్‌ఓ ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేస్తూ ఆందోళనలను చేపట్టింది. యూసు ఫ్ గూడలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్ర భుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్వహించిన నిరసనలో విద్యార్థులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. సే నో టు శక్తి, పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, ఎన్‌ఈపీ 2020 ను అమలు చేయొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఏఐడీఎస్‌ఓ నాయకులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను ఇతర శాఖలు, సంస్థల పరిధిలోకి మార్చడం ద్వారా సాంకేతిక విద్యకు ఉన్న ప్రత్యేకత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్ర భుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.