21 August, 2026 | 1:21 AM

వింటర్ గేమ్స్‌కు నయనశ్రీ

21-08-2026 12:24 AM

హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణకు చెందిన యువ స్కేటర్ నయన శ్రీ తాళ్లూరి చరిత్ర సృష్టించింది. ఐస్ స్పీడ్ స్కేటింగ్‌లో వింటర్ గేమ్స్‌కు అర్హత సాధించింది. అలాగే జూనియర్ వరల్డ్‌కప్‌కు కూడా క్వాలిఫై అయింది. ఇటీవల డెహ్రాడూన్ వేదికగా జరిగిన ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది.

14 దేశాలకు చెందిన స్కేటర్లు పోటీప డగా నయన శ్రీ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకోవడమే కాకుండా వింటర్ గేమ్స్‌కు అర్హత సాధించింది. నేషనల్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కే టింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకంతో మెరిసింది. నయన ఇప్పుడు వరుసగా ఐదుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి, భారతదేశపు అత్యుత్తమ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్లలో ఒకరిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఆమె ఈ క్రీడలో జాతీయ రికార్డు హోల్డర్ గానూ కొనసాగుతోంది.