25 August, 2026 | 2:15 AM

జీవో 97ను రద్దు చేయాలి: మాజీ ఎంపీ వినోద్

25-08-2026 12:34 AM

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి) : పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎంపీ బీ.వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కొనసాగిస్తూనే స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయొచ్చన్నారు. స్కిల్ యూనివర్సిటీ చట్టం, జీవో 97 పరస్పర విరుద్ధంగా ఉన్నాయని  ఆరోపించారు.  ప్రస్తుతం ఆ యూనివర్సిటీకి ఏఐసీటీఈ గుర్తిం పు కూడా లేదన్నారు.  రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరిధిలోనే పాలిటెక్నిక్ వ్యవస్థను  కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.