calender_icon.png 13 August, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ టవర్ల జాబితాలో ఆదిలాబాద్

11-08-2025 01:37:30 AM

  1. త్వరలోనే యువతకు ఉపాధి

ట్విట్టర్ ద్వారా కేటీఆర్  హర్షం

మా సంకల్పాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని ఆశిస్తున్నా

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఐటీ టవర్ పురోగతిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించి, నల్గొండ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్ధిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఐటీ టవర్ల జాబితాలో చేరిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. స్థానికంగా ఐటీ ఉద్యోగులు అందుబాటులోకి తెచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు ఆదిలాబాద్‌కు మంజూరైన ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తున్న విషయం తెలిసిందే. రెండు మూడు నెలల్లో భవనం పూర్తయ్యేలా పనులు కొనసాగుతున్నాయి.