1 April, 2026 | 11:03 PM

ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

01-04-2026 09:20 PM

కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని, లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అంటే పథకాల ప్రకటన కాదని, ప్రజల ముందే వారి చేతుల్లో నేరుగా సహాయం అందించడం అని తెలిపారు.

రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించే విధంగా ప్రభుత్వం కట్టిబడి ఉందని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం అని తెలిపారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, హనుమకొండ, కాజీపేట తహసిల్దార్లు గుజ్జుల రవీందర్ రెడ్డి, రాజు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయశ్రీ రజాలి, మామిండ్ల రాజు, పోతుల శ్రీమాన్, వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, పలు డివిజన్ అధ్యక్షులు ఎనుకుంటి పున్నం చందర్, తాళ్లపల్లి సుధాకర్, తడుక సుమన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పిట్టల వంశీ, మిడిదొడ్డి శేఖర్, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.