1 April, 2026 | 11:03 PM

జవహర్ నగర్‌లో చికెన్ షాపుల యజమానుల నిరసన

01-04-2026 09:17 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): పౌల్ట్రీ కంపెనీల ఆగడాలకు నిరసనగా జవహర్ నగర్ లోని చికెన్ షాప్  యజమానులు నిరసన తెలిపారు. ఈ మేరకు జవహర్ నగర్ లోని చికెన్ షాపుల యజమానులు సంపూర్ణంగా బుధవారం బంద్ చేపట్టి ర్యాలీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చికెన్ షాపుల యజమానులు మాట్లాడుతూ... చికెన్ షాపుల నిర్వహణ దినదిన గండంలా మారుతుందని పెట్టుబడి కూడా దక్కడం లేని తమ ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ షాప్ యజమానుల బాధను ప్రభుత్వం  పట్టించుకోని గిట్టుబాటు ధర దక్కేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ లోని చికెన్ షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు.