11-08-2025 09:00:38 AM
నిజాంసాగర్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి(Nizamsagar project) స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఏ ఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1391.92 అడుగులతో 4.936 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుండగా ప్రాజెక్టులోకి 4,690 క్యూసెక్కు ల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన తెలిపారు.