calender_icon.png 21 July, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాం మైసమ్మ ఉత్సవాలు

21-07-2025 01:23:15 AM

పట్టు వస్త్రాలు సమర్పించిన మురళీధర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): బోనాల పండుగ సందర్భంగా నాంపల్లి పటేల్‌నగర్ శ్రీ గోదాం మైసమ్మ దేవాలయంలో అమ్మ వారికి ఆలయ కమిటీ సభ్యుడు కే మురళీధర్‌రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను పూలమాలవేసి శాలువాగప్పి సత్కరించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కాంగ్రెస్ పార్టీని బలేపతం చేస్తూ, రాష్ట్ర పథకాలు నిరుపేదలకు అందేలా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు అమ్మవారి కృప పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని మురళీధర్‌రెడ్డి కాంక్షించారు.