calender_icon.png 21 July, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభివృద్ధికి ఇందిర మహిళా శక్తి పునాదిరాయి లాంటిది

21-07-2025 01:23:36 AM

  1. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ,రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి.

జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. 

నాగర్ కర్నూల్ జులై 20 (విజయక్రాంతి)రాష్ట్రంలోని మహిళల ఆర్ధికభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో పునాదిరాయి వేసిందని ఈ ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు.

ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ పి. అమరేందర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు మా ట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిలాభి వృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వ కాలంలో మహిళా సంక్షేమం నీరసించిందని ఇప్పుడు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 500 వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో మద్దతు లభిస్తోందన్నారు.

ఈ సందర్భంగా 254 సంఘాలకు 14.22 కోట్లు, 2,568 సభ్యులకు 3.03 కోట్లు, 5 మందికి 50 లక్షల ప్రమాద బీమా, 28 మందికి 17.40 లక్షల లోన్ బీమా చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలుపాల్గొన్నారు.