16-07-2025 11:24:18 PM
ప్రమాదం అంచున ఉన్న రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామాలు
ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామ పంచాయతీలో ఓడగుడం నుంచి రామన్నగూడెం రామ్ నగర్ వరకు గోదావరి ప్రవాహం వల్లే ప్రమాదం ఉందని ఈ గ్రామానికి ఉన్న ముప్పుకు సంబంధించిన కరకట్ట 20సంవత్సరాల కింద అప్పుడు ఉన్న ప్రభుత్వం కట్టిందో ఇప్పుడు కరకట్ట తెగిపోయి ప్రమాదం అంచున ప్రజల ప్రాణాలు ఉన్నాయని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. గత మా బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కరకట్టకు ఉన్న సమస్యలను గుర్తించి చాలా చోట్ల మరమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు. వెంటనే ఎక్కడైతే తెగిపోయే ప్రమాదం ఉన్నదో అలాగే ఓడగుడం దగ్గర చానా చిన్నగా ఉన్న కరకట్ట అక్కడక్కడ ఇసుక మేటలు పోయడం జరిగింది.
ఎక్కడైతే కరకట్ట డౌన్ గా ఉన్నదో వెంటనే మరమ్మతులు చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఇరిగేషన్ ఇంజనీరింగ్ తో మాట్లాడిన లక్ష్మణ్ బాబు జీవో ట్యూబ్ టెక్నాలజీ తోటి కొంత వర్క్ చేయిస్తున్నారు కానీ మన ఇంజనీరింగ్ వారికి ఆ సబ్జెక్ట్ అవగాహన లేదు. ఈ టెక్నాలజీ అస్సాం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెబుతున్నారు. కానీ వారి కాంట్రాక్టర్ తో కూడా మేము మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేమని మన ఇంజనీరింగ్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పూర్తి అధ్యాయం చేసి వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు