calender_icon.png 17 July, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు మండలంలో జూలై 19న అరుణోదయ రాష్ట్ర సదస్సు

17-07-2025 12:00:00 AM

ఇల్లందు. జూలై 16.(విజయ క్రాంతి) బి జెపి నరేంద్ర మోడీ11 సంవత్సరాల పాలన దేశ ప్రజల మౌలిక సమస్యలు పక్కకు పెట్టి దేశవిదేశీ పెట్టుబడి దారులకు ప్రజా సంపద దోచిపెడుతుందని,ప్రజా వ్యతిరేక చట్టాలతో కార్పోరేట్ కంపెనీలకు దేశ సంపదను దారదత్తం చేయటానికి చట్టాలను సవరిస్తుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు. భూక్యా భిక్షం అన్నారు.

బుధవారం ఇల్లందు మండ లం బొంబాయి తండాలో జూలై 19న ఇల్లందులో జరిగే అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రా  లు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలోని ఆదివాసీ, గిరిజనుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ప్రజలమధ్య విషబీజాలు నాటుతూ, ఐక్యంగా ఉన్న ప్రజలమధ్య తారతమ్యాలు సృష్టిస్తు, దేశంలోని దళిత, మైనా రిటీ బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తోందని, భూటకపు ఎంకౌంటర్ పేరుతో అమాయకులను, మహిళలను హత్య చేస్తూ పాసిస్టు పాలనను కొనసాగిస్తోందన్నారు.

తోడు దొంగలు మోడీ-అమిత్ షా లు ఆదివా సి ప్రాంతాలలోని సంపదను కార్పొరేట్, పె ట్టు బడిదారులకు అప్పగిస్తున్నారని దీనిని ప్రజాలు కళాకారులూ వ్యతిరేకించాలని కో రారు.ఇందులో భాగంగానే అడవిలోని ఆదివాసి, గిరిజన ప్రాంతాలను పోలీసు బలగా లతో నింపి అడవిలో నివసిస్తున్న వారిని హింసించి చంపుతున్నారని, ప్రశ్నించిన మే ధావులను,

హక్కుల సంఘ నేతలను జైల్లో నిర్బంధిస్తున్నారనికళాకారులుగా దీనిని వ్య తిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ దేశ పౌరులుగా,ప్రజా కళాకారులుగా రా జ్యాంగంలోని హక్కులను రక్షించడం కోసం మూలవాసుల హక్కులకోసం నిర్వహించే ఉ ద్యమానికి ఆసరాగా నిలవాలని అందుకో సం ఈనెల 19న ఇల్లందులో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కమిటీ నిర్వహించే సదస్సులో మీ గొంతు కలిపాలని పి లునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూక్యా మం గ్య, దేవిజ్య, భూక్యా లక్ష్మణ్, శ్యామ్, జరపల లక్ష్మణ్, రమేష్, దారావతు లక్ష్మ, మంగీలాల్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.