18 July, 2026 | 1:55 AM

గోదావరి పుష్కర ఏర్పాట్లు ముమ్మరం!

18-07-2026 01:55 AM
  1. టూరిజం కారిడార్‌పై భక్తుల ఆశలు
  2. గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం నజర్ 
  3. జిల్లాలో ఏడు చోట్ల పుష్కర ఘాట్లు 
  4. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు 

నిర్మల్ జులై 17 ( విజయక్రాంతి) ప్రతి 12 ఏళ్ల కు ఒకసారి వచ్చి పుష్కరాలపై ప్రభు త్వం దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద ప్రభాక నదిగా పేరొందిన గోదావరి పుష్కరాలు 2027 లో జరగనున్నాయి. జూన్ 26 నుంచి జూలై 27 ఈ పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జి ల్లా యంత్రాంగం నిర్మల్ జిల్లాలో గోదావరి పుష్కరాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.2015 లో అప్పటి బి ఆర్‌ఎస్ ప్రభుత్వంలో గోదావరి పుష్కరాలు జరగగా 12 ఏళ్ల తర్వాత ప్ర జా పాలన ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా ని ర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఇప్పటికి దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను రూ 245 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన సంగ తి తెలిసింది. పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2027 పుష్కరాలకు ముందే బాసరను మొదలుకొని గోదావరి ప్రవా హం ఆంధ్రప్రదేశ్లో కలిసి చోటు వరకు టూ రిజం కారిడార్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 

పుష్కర అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి 

గోదావరి పుష్కరాలు 2027లో జరగను నేపథ్యంలో ఏడాది కాలంలో గోదావరి పరివాహ ప్రాంతంలో పుష్కర ఘాట్లు ఉన్న ప్రాంతాల్లో చేపట్టవలసిన పనులపై ప్రభు త్వం దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో బాసరలో గోదావరి ప్రారంభమై మంచిర్యా ల జిల్లా కోటపల్లి శిరోంచ మహారాష్ట్ర బోర్డర్ వరకు గోదావరి ప్రవహిస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో బాసర, బ్రహ్మేశ్వర్, సో న్ మాదాపూర్, కూచనపల్లి, ధర్మారం పొనక ల్, బాధనకుర్తి, బే ల్లాల్ తదితర ప్రాంతాల్లో గోదావరి పుష్కర పుష్కర ఘాట్ ల వద్ద భక్తులు పవిత్ర స్నానాలు చేసి పూజలు చే యనున్నారు.

ప్రధానంగా బాసర సోన్ , బో ధనకుర్తి, పుష్కర ఘాట్ లోని ఎక్కువగా భ క్తులు తరలివస్తారు. నిర్మల్ జిల్లాకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న గోదావరి పుష్కర ఘట్ల నేపథ్యంలో హైదరాబాద్ మెదక్ కా మారెడ్డి సిద్దిపేట మహారాష్ట్ర తదితర ప్రాం తాల ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉం ది. ఈ నేపథ్యంలో ఈ గట్ల వద్ద పుష్కర స్నా న ఘట్టాలు నిర్మించడం రోడ్డు వేయడం విద్యుత్ సౌకర్యం టూరిజం అభివృద్ధి పర్యాటక అభివృద్ధి పోలీసు రక్షణ చర్యలు భద్రతా చర్యలు రవాణా ట్రాఫిక్ సమస్యల, పారిశుద్ధ్యం, తదితర వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఇప్పటికీ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

పంచాయ తీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనా లు, విద్యుత్తు, పోలీసు, రెవిన్యూ, విపత్తు నిర్వహణ, టూరిజం తదితర శాఖల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ రూపొందించి అభి వృద్ధి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం గోదావరి పుష్క రాలకు చేపట్టే అభివృద్ధి పనులకు నిధులు కూడా విడుదల చేయను నేపథ్యంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై జిల్లా యం త్రాంగం దృష్టి పెట్టింది.

బాసర గోదావరిలో పుష్కర స్నానం చేయడానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్వం రికార్డులను పరిశీలించి ప్రస్తుతం సౌకర్యలేవి కల్పించవలసిన సౌక ర్యం లు ఏవి, తాత్కాలిక పనులు, శాశ్వత ప నులు తదితర వాటిపై దృష్టి పెట్టింది , గత పుష్కరణ సందర్భంగా ఏర్పడ్డ లోటుపాట్లు అధ్యయనం చేస్తున్నాను. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పుష్కర అభివృద్ధి పనులు కూడా భక్తుల కనుగుణంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ఏడాది కాలమే సమయం 

గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూన్ 26న ప్రారంభమై జులై 7న ముగియనున్న నేపథ్యంలో పుష్కర ఏర్పాట్ల పనులకు ఏడాది కాలం మాత్రమే మిగిలి ఉంది. జిల్లాలోని గోదావరి పుష్కరాల నిర్వహించే ప్రదేశాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు రోడ్లు విద్యుత్తు చిరుజల్లుల పంపిణీ మరుగుదొడ్లు మూత్రశాలలు గతంలో నిర్మించారు. వాటి మరమ్మతులు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడే ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు.

పుష్కర ఘాట్ ల వద్ద భక్తులకు రక్షణ చేపట్టన్నారు. రోడ్లు విద్యుత్తు పారిశుద్ధం వంటి పనులకు పెద్ద ఎత్తున ప్రార్థనకు అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కర కాట్ల వద్ద చేపట్టవలసిన పనులపై ఇప్పటికి యాక్షన్ ప్లాన్ కలెక్టర్ భవిష్ మిశ్రా సహకారంతో జిల్లా అధికారులు రూపొందించి పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రత్యేక టూరిజం కార్రిడార్గా బాసర అభివృద్ధి చేయడంతో భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది 

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ 

నిర్మల్ జిల్లాలోని గోదావరి పుష్కర ప్రాంతాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు. సోన్ ఖానాపూర్ పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా పనులు నాణ్యతగా చేపట్టాలని ఆయా శాఖ అధికారులకు సూచించారు.