calender_icon.png 5 February, 2026 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరు దిశగా గోదావరి

29-07-2024 12:29:58 AM

పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండో రోజు ఆదివారం కూడా ఎత్తిపోతలు నంది మేడారానికి కొనసాగాయి. ఈ ప్రాజెక్టు నుంచి 12,000 క్యూసెక్కుల నీటిని నాలచగు పంపుల ద్వారా అధికారులు గాయత్రి పంప్ హౌస్‌కు తరలించారు. అక్కడినుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరుకు అదే స్థాయిలో వీటిని తరలిస్తున్నారు. గాయత్రి పంప్‌హౌజ్ నుంచి నాలుగు బహుబలి మోటార్ల ద్వారా ఎత్తిపోతలు ప్రారంభించడంతో మిడ్ మానేరుకు నీరు వచ్చి చేరుతున్నది. ఆదివారం మధ్యాహ్నం వరకు నీరు 6.53టీఎంసీలకు చేరింది. జలాశయం నుంచి ఎలాంటి ఔట్‌ఫ్లో లేదు.