calender_icon.png 8 December, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల కోట.. సుంకరి కోటలో గోదావరిఖని ఏసిపి రమేష్

08-12-2025 04:35:50 PM

ట్రాక్టర్ లో మానేరు దాటి శాత్రాజ్ పల్లి భద్రత ఏర్పాట్లు

ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఏసిపి మడత రమేష్ 

ముత్తారం (విజయక్రాంతి): ఒక్కప్పుడు మావోయిస్టుల కోట.. సుంకరి కోటలో గోదావరిఖని ఏసిపి రమేష్ సోమవారం ట్రాక్టర్ లో మానేరు దాటి పారుపల్లి గ్రామ పంచాయతీలోని శాత్రాజ్ పల్లి అటవీ గ్రామంలో ముత్తారం ఎస్ఐ రవికుమార్ తో కలిసి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాత్రాజ్ పల్లి గ్రామంలో గిరిజన ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొనేలా భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. సర్పంచులు గా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

ముత్తారంలో ఎన్నికల కోడ్ పై అవగాహన 

ముత్తారం మండల కేంద్రంలో ఎన్నికల కోడ్ పై గోదావరిఖని ఏసిపి మడత రమేష్ ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని ఏసిపి సూచించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.