08-12-2025 04:49:00 PM
- శాంతిఖనిలో 56వ రక్షణ పక్షోత్సవాలు
- శాంతిఖని గనిలో తనిఖీ..
బెల్లంపల్లి (విజయక్రాంతి): 56వ రక్షణ పక్షోత్సవాలులో భాగంగా సేఫ్టీ కమిటీ కన్వీనర్ శ్రీ బి.సైదులు జీ.ఎం,(ఎన్విరాన్మెంట్) కార్పొరేట్, మందమర్రి ఏరియ జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ జి.ఎం సేఫ్టీ బెల్లంపల్లి రీజియన్ కె.రఘు కుమార్, సేఫ్టీ ఆఫీసర్ ఎన్ భూశంకరయ్య బృందం సోమవారం మందమర్రిలోని శాంతిఖని గనిని తనిఖీ చేసింది. గనిలో దిగిన బృందం రక్షణ సదుపాయాలను పరిశీలించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వామి కావాలని కార్పొరేట్ రక్షణ కమిటీ కన్వీనర్ ఎన్విరాన్మెంట్ జీఎం బి.సైదులు, మందమర్రి ఏరియ జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు.
రక్షణ కోసం ఉద్యోగులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను పనిముట్లను వాడాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని అన్నారు. శాంతి కని లోని కన్వేయర్ బెల్ట్ 15 నుంచి 16 గంటల వరకు నడిపించాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలనన్నారు. గనిలో అనుకోకుండా ప్రమాదాలకు గురైనప్పుడు ఉద్యోగికి అందించే (ఫస్ట్ ఎయిడ్) ప్రధమ చికిత్స గురించి ఉద్యోగులకు అర్థమయ్యే రీతిలో ఫస్ట్ ఎయిడ్ మెంబెర్స్ వారికి వివరించారు. అనంతరం కమ్యూనికేషన్ సెల్ మందమర్రి ఏరియ వారిచే రక్షణ జాగ్రత్తల గురించి వివరిస్తూ ఉద్యోగులకు అర్థమయ్యే రీతిలో లఘు నాటిక అందరినీ ఆకట్టుకున్నది.
ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం జి.ఎల్ ప్రసాద్, బెల్లంపల్లి ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, పి శ్రీనివాస్, డీజీఎం, (ఓ/ఓ) జి.ఎం (సిపి & పి), సముద్రాల శ్రీనివాస్, డివై ఎస్.ఇ ఈ అండ్ ఎం, (ఐ అండ్ పి) ఎం, కార్పొరేట్, బి.దేశాయ్, డీజీఎం సర్వే, శ్రీ బి మహేందర్ జూనియర్ సర్వే ఆఫీసర్ వకీల్ పల్లి ఆర్జీ 2, షేక్ కమ్రుద్దీన్, అడిషనల్ మేనేజర్ ఎంవీటీసీ శ్రీరాంపూర్ ఏరియా, సాండ్ స్టోయింగ్ మెంబర్, సునీల్ కుమార్ అడిషనల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ కార్పొరేట్, పి ఆదినారాయణ, మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్ రామగుండం 1, ఫస్ట్ ఎయిడ్ మెంబర్,కె. వెంకటస్వామి వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మైనింగ్ వకీల్ పల్లి, పి. సందీప్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ పీవీకే5, కే నాగమోహన్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మెకానికల్ వి.కే ఓ.సి, శాంతిఖని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హ, సేఫ్టీ ఆఫీసర్ పి.రాజు, గని సంక్షేమాధికారి రవికుమార్, సీనియర్ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.