విరోధినిగా దర్శనమిచ్చిన భద్రకాళీ మాత
20-07-2026 01:44 AM
మహబూబాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకల్లో భాగంగా ఐదవ రోజు ఉద యం కాళీ క్రమాన్ని అనుసరించి ‘విరోధిని’ గాను, షోడశీ క్రమాన్ని అను సరించి ‘వహ్నివాసిని’ గాను అంకరించి పూజారాధనలు నిర్వహిం చారు. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.






