కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
20-07-2026 01:43 AM
ఆలేరు, జులై 19 : భువనగిరి 22వ వా ర్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు బట్టు మ హేందర్ గత 4 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించి, పిల్లల చ దువుతో సహా అన్ని విధాలా అండగా ఉం టానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు తమ ఎమ్మెల్యే అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షులు కూర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






