08-12-2025 06:39:49 PM
-రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీల్లో విద్యార్థులకు బంగారు పతకాలు..
-కనగర్తి ఉన్నత పాఠశాల హెచ్ఎం వినోద్ కుమార్..
కోనరావుపేట (విజయక్రాంతి): తైక్వాండోతో విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పాటు క్రమశిక్షణ పెంపొందించుకోవచ్చని కనగర్తి జడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో వీర కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీల్లో మండలంలోని కనగర్తి జడ్పి ఉన్నత పాఠశాలకు చెందిన శరణ్య, పల్లవి, వైష్ణవి, రుచిత, వర్ష, నిత్య, రేష్మ, వైష్ణవి, నక్షత్ర, రచన విద్యార్థులు కుమిటే విభాగంలో 10 బంగారు పతకాలు సాధించారన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు ఆత్మ రక్షణ కోసం తైక్వాండో తప్పనిసరిగ నేర్చుకోవాలన్నారు. బాలికలు తైక్వాండో నేర్చుకోవడంతో మానసిక దృఢత్వంతో పాటు తెగింపు వస్తుందన్నారు. అనంతరం విద్యార్థులను శాలువాతోని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్ ఏం.శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఏ. కనకయ్య, శ్రీనివాస్ విద్యార్థులు ఉన్నారు.