08-12-2025 06:42:45 PM
-5 సంవత్సరాల లా కోర్స్ స్టూడెంట్స్
హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల ఐదు సంవత్సరాల లా విద్యార్థులు యూనివర్సిటీ మొదటి గేటు నుండి పరిపాలన భవనం వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం పరిపాలన భవనం ఎదుట న్యాయ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం తక్షణమే కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము విద్యను అభ్యసిస్తున్న మాకు ఎలాంటి హాస్టల్ సౌకర్యం వసతులు గాని యూనివర్సిటీ అధికారులు ఇవ్వడం లేదని వాపోయారు. ముఖ్యంగా విద్యార్థులు ఉండడానికి హాస్టల్ కూడా కేటాయించలేదంటే న్యాయ విద్యార్థుల పైన, న్యాయ కళాశాల పైన యూనివర్సిటీ అధికారులకు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలన్నారు.
విద్యార్థులకు కళాశాలలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, వాటిని పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తక్షణమే హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలని లేదంటే న్యాయ కళాశాల విద్యార్థులు అందరూ కూడా పరిపాలన భవనం వద్దనే బస ఏర్పాటు చేసుకొని నిరసన తెలియజేస్తామన్నారు. అనంతరం యూనివర్సిటీ రిజిస్టార్, హాస్టల్ డైరెక్టర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడిన విద్యార్థులు అధికారుల మాటలు దాటవేసే విధంగా ఉన్నాయని శాంతించ కుండా వారి నిరసన కొనసాగించారు. హాస్టల్ సౌకర్యం కల్పించేంతవరకు కూడా యూనివర్సిటీ పరిపాలన భవనం నుండి కదిలేది లేదని వారు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ విద్యార్థులు స్టాలిన్, రంజిత్, కుమార్, సందీప్, అరుణ్, రాకేష్ రెడ్డి, శ్రీను, ఆదిత్య, సంధ్య, రోహిత్, ప్రదీప్, శివాజీ, యాకూబ్, ప్రవళిక, సింధు, రణధీర్, శరత్, వర్షిత్, శృతి, సాయి కీర్తన, అశ్విత , చందన, నిచిత , అశ్వినీ,శర్వాణి, లాసిని, సంజన, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.