calender_icon.png 8 December, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత గూటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు

08-12-2025 06:36:05 PM

స్వాగతించిన హరీష్ రావు.. 

పటాన్ చెరు: హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీమంత్రి హరీష్ రావు సమక్షంలో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మండల ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల కాంగ్రెస్ నాయకులు గుమ్మడిదల మాజీ ఎంఎంపీ విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్, మాజీ ఎంపిపీ హుస్సేన్, బాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... గుమ్మడిదాల మండల అభివృద్ధిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని, కీలక నాయకులు పార్టీపై నమ్మకం ఉంచి చేరిక కావడం బీఆర్‌ఎస్ బలోపేతానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ... గుమ్మడిదల ప్రాంత అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు ప్రజలకు మరింత చేరువ అయ్యాయని, భవిష్యత్తులో ప్రాంత అభివృద్ధికి కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మేట్టు కుమార్ యాదవ్, పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య  బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.