15 April, 2026 | 1:53 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

గొల్లగూడెం జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

09-02-2026 12:00 AM

సంస్థాన్ నారాయణపూర్, ఫిబ్రవరి 8 :  మండలం లోనిఅల్లందేవిచెర్వు  పరిధిలో గల గొల్లగూడెంలో వెలసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం  మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.ఆదివారం  కళ్యాణ మహోత్సవ వాల్ పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులు విడుదల చేశారు.

సుర్వి రాజు గౌడ్  మాట్లాడుతూ గొల్లగూడెం గుట్టమీద ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం ఎంతో మహిమగల శివలింగమని,ఎన్నో ఏళ్లుగా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ కళ్యాణం అంగరంగ వైభవంగా  జరిపించడం అనేది ఆనవాయితీ అని తెలిపారు. మార్చి 15వ తేదీ రాత్రి 9:00 గంటలకు జరగబోయే  కళ్యాణ మహోత్సవానికి  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోధుమ గడ్డ జంగారెడ్డి, సామ వెంకట్ రెడ్డి ముక్యర్ల స్వామి యాదవ్,సుర్వి నరేష్ గౌడ్,సామ రఘుమారెడ్డి,పాటి రుక్మారెడ్డి,సురుగూరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.