calender_icon.png 8 May, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లోనే సరుకులు విక్రయించాలి

05-04-2025 12:00:00 AM

దిద్దుబాటు చర్యలు చేపట్టిన మార్కెట్ అధికారులు 

మహబూబాబాద్, ఏప్రిల్ 4 ( విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వెలుపల వ్యవసా య ఉత్పత్తుల కొనుగోలుతో కార్మికుల ఉపాధికి గండి పడుతోందన్న నిరసనల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మార్కెట్ చై ర్మన్ గంట సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మార్కె టింగ్ శాఖ అధికారులు, పోలీసులు, వివిధ పక్షాలతో సమీక్ష నిర్వ హించి మార్కెట్ ప్రతిష్టకు భంగం కలగ కుండా చూడడంతో పాటు, మార్కెట్ బయట వ్యవసాయ ఉత్ప త్తుల కొనుగోలు చేపట్టకుండా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.

కేసముద్రం మార్కెట్ పరిధిలో ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేం దుకు ప్రచారం చేపట్టారు. మార్కెట్ వెలుపల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిం చడం వల్ల రైతులకు నష్టం జరగడంతో పాటు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడం వల్ల మోసాలకు తావు లేకుండా ఉంటుందని మైకు ద్వారా ప్రచా రం నిర్వహిస్తున్నారు.

అలాగే వ్యాపారులు ఎవరు కూడా మార్కెట్ బయట ట్రేడింగ్ కంపెనీలు, మిల్లులు, వే బ్రిడ్జిల వద్ద కాంటాలు వేయించి నేరుగా రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకూ డదని, మార్కెట్లోనే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయా లంటూ తాకీదులు జారీ చేశారు. దీనికి తోడు పోలీసులు కూడా రోడ్డుపై ఎక్కడప డితే అక్కడ వాహనాలను నిలిపి ఉంచకుం డా చర్యలు చేపట్టారు.

మార్కెట్ బయట కొందరు వ్యాపారులు నేరుగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల వల్ల ట్రాఫిక్ కు అం తరాయం ఏర్పడడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యని, వే బ్రిడ్జి వద్ద వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను నిర్వ హించకూడదని మహబూ బాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆదేశిం చారు.

మార్కెట్ వెలుపల వ్యవసాయ ఉత్పత్తులకు కొనుగోళ్ల వల్ల మార్కెట్లో ఉన్న వ్యాపారులకు గిరాకీ తగ్గిందని కొందరు ప్రత్యక్ష నిరసనకు దిగడం తో పాటు కార్మిక సంఘాలు ఐఎఫ్టియు, ఏ ఐ సి టి యు ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో దిద్దుబాటు చర్యలకు మార్కెట్ పాలకమండలి, అధికారులు నడుం బిగించారు.