calender_icon.png 7 May, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లు డ్రైవింగ్ చేస్తే.. వాహనం రిజిస్ట్రేషన్ రద్దు

05-04-2025 12:00:00 AM

నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : నగరంలో మైనర్లు డ్రైవింగ్ చేయడాన్ని నిర్మూలించేందుకు పోలీసులు చర్యలు  చేపట్టారు.  ఇక నుంచి మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. నేటి నుంచి  మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఏడాది పాటు వాహనం రిజిస్టేషన్‌ను రద్దు చేస్తామని హైదరాబాద్ జాయింట్ కమిషనర్, ట్రాఫిక్ డి.జో యెల్ డెవిస్ తెలిపారు. మైనర్లు డ్రైవిం గ్ చేస్తూ పట్టుబడితే ఆ వాహన యజమానులు, తల్లిదండ్రులను బాధ్యులు గా చేస్తామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనం నడిపిన మైనర్ 25 ఏళ్లు వచ్చే సరికి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అనర్హులని పేర్కొన్నారు. మైనర్ వాహనం నడిపితే జరిమానా తో పాటు శిక్ష విధిస్తారని తెలిపారు. కావున మైనర్లు వాహనాలు నడుపకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకో వాలని సూచించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో రోడ్డు ప్రమాదా లను నివారించడానికి, ప్రాణాలు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని నగరవాసులను కోరారు.