27 April, 2026 | 1:52 AM

గోపాలరావు మృతి సాహిత్య రంగానికి తీరని లోటు

27-04-2026 12:00 AM

తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్

ముషీరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): గోపాలరావు మృతి సాహిత్య రంగానికి తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోయ చంద్రమోహన్,  సీనియర్ జర్నలిస్టు కొండూరు వీరయ్య లు అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గోపాల రావుకు సాహిత్యకాడమీ పూర్వ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ నివాళులర్పించారు.

ఆయన బౌతిక దేహాన్ని ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని తన స్వగృ హంలో తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, తెలంగాణ బుక్ట్రస్ట్ వ్యవస్థాపకులు కోయ చంద్రమోహన్, సీనియర్ జర్నలిస్ట్ కొండూ రు వీరయ్య కవులు, రచయితలు సందర్శించి  సంతాపాన్ని తెలియజేశారు. అయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. గోపాల్ రావు అంతిమ యాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి బన్సిలాల్ పేట్ వరకు జరిగింది. అంత్యక్రియలు బన్శీలాల్ పేట్ స్మశాన వాటికలో ముగిసాయి.