27 April, 2026 | 1:49 AM

పర్యావరణవేత్త సత్యనారాయణపై దాడి హేయం

27-04-2026 12:00 AM
  1. మంత్రి కొండా సురేఖ
  2. నిమ్స్‌లో పరామర్శ వైద్య చికిత్సపై ఆరా

ఖైరతాబాద్, ఏప్రిల్26(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ, నీటి హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ ఉద్యమకారుడు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడి హేయమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. తీవ్ర గాయాలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయ ణను ఆమె పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి, దాడి జరిగిన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, గాయాలతో రక్తసిక్తమైన సత్యనారా యణ శరీరం విధ్వంసానికి గురైన అడవిని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చదనం పెంపు, నీటి వనరుల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిపై దాడి జరగడం అంటే మనిషి ఉనికిపై దాడి చేసినట్టే నని పేర్కొన్నారు.

జలసాధన సమితి వ్యవస్థాపకుడిగా సత్యనారాయణ చేసిన సేవల ను మంత్రి ప్రశంసించారు. సత్యనారాయణ స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రజలంద రూ ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రకృతి సేవలో నిమ గ్నం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.