13 June, 2026 | 1:46 AM

సింగగా వస్తున్న గోపీచంద్

13-06-2026 12:00 AM

టీ గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీ వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌తోపాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు. పక్షుల కిలకిలారావాలు, ఆదివాసీ సంప్రదాయ శబ్దాలు కలగలిసిన నేపథ్య సంగీతంతో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది.

దట్టమైన చీకటి నిండిన అడవిలో సంచరిస్తున్న గోపీచంద్ లుక్‌ను రివీల్ చేసిన విధానం ఆశ్చర్యపరిచింది. కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలి, ప్రతీకారంతో రగిలిపోతున్న పాంథర్‌లా కనిపిస్తూ పవర్‌ఫుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు గోపీచంద్. గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్గడ్ అవతార్‌లో గోపీచంద్ కనిపించడం అభిమానులకు పర్‌ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్ అనిపించింది. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ మరోస్థాయిలో ఉంది. ఈ చిత్రంతో మలయాళ నటి అనార్కలి నజర్ కథానాయికగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి డీవోపీ: షామ్‌దత్ ఐఎస్‌సీ; సంగీతం: సామ్ సీఎస్; ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ -మోనిక.