ప్రేమ డైరీలో చివరి పేజీలు
13-06-2026 12:00 AM
పీవీ అర్జున్ యాదవ్, అదితి జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’. దర్శకుడు హరికృష్ణ పామంజి దీన్ని ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పీవీ నరసింహ యాదవ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రేమ, భావోద్వేగాలు, మరిచిపోలేని జ్ఞాపకాల సమాహారంగా రూపొందిన ఈ సినిమా గుండెలను హత్తుకోవడం ఖాయమని చెబుతోంది టీమ్. ఈ చిత్రానికి అర్మాన్ మెరుగు సంగీతం అందిస్తుండగా, తేజ ఏ సినిమాటోగ్రాఫర్‌గా, అలతోర్ రాజేశ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ మూవీ మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.






