గోపీచంద్ సినిమా పేరు.. భరత వర్ష
గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న ఈ చారిత్రక యాక్షన్ డ్రామా ఇప్పటివరకు ‘గోపీచంద్33’గా ప్రచారంలో ఉంది. తాజాగా చిత్ర నిర్మాతలు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ వీడియోలో భరత భూమికి (భారతదేశానికి) ప్రతీకగా నిలిచే ‘భరత వర్ష’ టైటిల్ రివిల్ కావడం ఆసక్తిగా అనిపించింది. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ కథలో భాగంగా శూల భూమి సన్నివేశాలతో ఈ వీడియో ప్రారంభమైంది. భారీ యుద్ధ సన్నివేశాలు యాక్షన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తన విజన్‌తో భారత చరిత్రలో ఎక్కువగా పరిశీలించని ఒక అధ్యాయాన్ని గొప్పగా ఆవిష్క రించినట్టు ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
హీరో గోపీచంద్ ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యా రు. ఫిజిక్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిసిన పాత్రలో ఆయన నిజమైన వీరుడిలా కనిపిస్తున్నారు. హీరో యిన్‌గా రీతూ వర్మ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్; ఎడిటర్: చోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: చిన్న.




