కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పాలన గందరగోళం
ఈఓ నిర్లక్ష్యంతో అవ్యవస్థల గూటిగా మారుతున్న పుణ్యక్షేత్రం
కాళేశ్వరం (విజయక్రాంతి):రాష్ట్రంలో అత్యంత ప్రాచీన, ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ప్రస్తుతం తీవ్ర పాలనా నిర్లక్ష్యానికి లోనవుతోందన్న ఆరోపణలు భక్తులు, స్థానికుల నుండి వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి ని యమితుడైన ఈఓ (కార్యనిర్వహణ అధికారి) ఆలయ వ్యవహారాల పట్ల పూర్తిగా నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం కు మూడు రోజులు, అదీ కార్యాలయానికే పరిమితం
ఈఓ ఆలయానికి వారం లో మూడు రోజులకు ఒకసారి మాత్రమే వస్తున్నారని, వచ్చినా ఆలయ ప్రాంగణం వైపు వెళ్లకుండా నేరుగా ఈఓ కార్యాలయంలో కూర్చుని కిం ది స్థాయి సిబ్బంది తీసుకువచ్చే ఫైళ్లపై సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని భక్తులు ఆరో పిస్తున్నారు. దర్శన క్యూలు, భక్తుల సౌకర్యాలు, ఆలయ పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై కనీసం పర్యవేక్షణ కూడా చేయ డం లేదని పేర్కొంటున్నారు.
ఆదివారం సెలవు& భక్తులకు మాత్రం కష్టదినం
ఆదివారం సెలవు దినంలా ఈఓ కార్యాలయానికే రాకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆలయంలో ఏర్పడే సమస్యలపై భక్తులు ఫోన్ చేసినా స్పందన ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు.
నీటి సమస్యలు& ఫిర్యాదులపై మౌనం
ఆలయంలో భక్తులకు తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని, ఫిర్యాదు చేద్దా మంటే స్పందించే అధికారులు ఎవ్వరూ లేక భక్తులు అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. ఈఓ పర్యవేక్షణ లేకపోవడంతో కిం ది స్థాయి సిబ్బంది కూడా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘ఎవ్వరికి వారే యమునా తీరే’ పరిస్థితి
ఈఓ నిర్లక్ష్యం కారణంగా ఆలయం ‘ఎవ్వరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా మారిం దని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయం లో పాలనా నియంత్రణ పూర్తిగా సడలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుష్కరాలకు ముందే హెచ్చరిక గంటలు
రాబోయే రోజుల్లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో భక్తుల రాక భారీగా పెరగనుంది. ఈ పరిస్థితిలో ఆలయ పాలన ఇదే విధంగా కొనసాగితే తీవ్రమైన అవ్యవస్థలు తప్పవని భక్తులు హెచ్చరిస్తున్నారు.
200 కోట్ల పనులకే ప్రశ్నార్థకం?
రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కేటాయించాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ‘ఇక్కడి ఈఓకే ఆలయం రావడమే సరిగా లేకపోతే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి?’ అన్న ప్రశ్నలు భక్తుల మధ్య వినిపిస్తున్నాయి.
మంత్రి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి!
రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఉ న్న కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలోనే ఇలాం టి పరిస్థితి ఉంటే, ఇతర ప్రాంతాల ఆలయాల పరిస్థితి ఎలా ఉంటుందన్న సందే హం భక్తుల్లో నెలకొంది.ఇక మరోవైపు మం త్రి గారి సతీమణి దేవాదాయధర్మదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి
ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించి, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.పవిత్ర క్షేత్ర గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






