26-12-2025 12:00:00 AM
జంపన్న వాగు వద్ద ఉన్న స్నాన ఘట్టాలు పరిశుభ్రంగా ఉంచాలి: రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క.
ములుగు,డిసెంబర్25(విజయక్రాంతి): నిర్ణీత సమయంలో మేడారం మహా జాతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీ ణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు గురువారం ఎస్.ఎస్. తాడ్వాయి మం డలంలోని మేడారంలో జరుగుతున్ శ్రీసమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, పార్కింగ్ స్థలాలను, బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న పనులను,విఐ పి,వివిఐపి రోడ్లను శ్రీరామ్ సాగర్ చెరువు ను రోడ్ల విస్తరణను జంపన్న వాగు దగ్గర ఉ న్న స్నాన ఘట్టాలను రాష్ట్ర పంచాయతీ రా జ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫ రా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
అనంతరం మంత్రి సీతక్క మే డారంలోని ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జంపన్న వాగు పరిసరాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భక్తు లు అధిక సంఖ్యలో వస్తున్న సందర్భంలో స్నాన ఘట్టాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా చూసుకోవాలని,కొంగలమడుగు ఏరి యా నుండి జంపన్న వాగు వరకు రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని,భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమ్మక్క సా రలమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి,పనులలో ఇంకా వేగం పెంచాలని,లేబర్ ను అదనంగా తెప్పించి షిఫ్ట్ ల వారిగా 24గంటలు అభివృద్ధి పను లు చేపట్టాలని అధికారులను,గుత్తేదారులను మంత్రి ఆదేశించారు.