10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దివ్యాంగ బాధితులకు ప్రభుత్వం చేయూత

04-07-2025 10:21 PM

సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలోని జన్నారం మండలం చింతగూడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి పుదారి రాజన్న, కుమారుడు పుదారి సత్యనారాయణలు ఒకే రకమైన కండరాల వ్యాధితో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన సూచనల మేరకు జిల్లా యంత్రాంగం వారి కుటుంబాన్ని సంప్రదించి వివరాలు నిర్ధారించిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కదలలేని స్థితిలో ఉన్న పుదారి రాజన్న, సత్యనారాయణల కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చౌకధరల దుకాణం ద్వారా ప్రతి నెల 18 కిలోల బియ్యం అందించడం జరుగుతుందని, సత్యనారాయణ దివ్యాంగుల వర్గం క్రింద నెలకు 4 వేల 16 రూపాయలు చేయూత పెన్షన్ పొందుతుండగా, పుదారి రాజయ్య 2 వేల 16 రూపాయల వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారని తెలిపారు.

జిల్లా అధికార యంత్రాంగం రాజయ్య వైకల్యాన్ని నిర్ధారించేందుకు స్లాట్ బుక్ చేసి వైకల్య ధృవీకరణ పత్రం జారీ చేయబడిన తరువాత వృద్ధాప్య ఫించన్ను దివ్యాంగ ఫించన్ గా సవరించి తీసుకుంటుందని, తద్వారా వారికి అధిక ఫించన్ మొత్తం లభిస్తుందని తెలిపారు. వారిరువురికి మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రభుత్వ ఖర్చులతో వారిని హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్చాలని ప్రతిపాదించబడిందని, వారి సమ్మతితో లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రస్తుతానికి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద పలియేటివ్ (ఉపశమనకారకం) కేర్ యూనిట్ ద్వారా జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించడంతో పాటు వారికి వీల్ చైర్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం వారి చికిత్స కొరకు ఇప్పటికే చేసిన వైద్య బిల్లులతో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని తెలిపారు.