calender_icon.png 5 July, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండు గంజాయి పట్టివేత

04-07-2025 10:17:14 PM

మునిపల్లి: గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న 765 గ్రాముల ఎండుగన్ జాయిన్ మునిపల్లి పోలీసులు శుక్రవారం నాడు కంకోల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా టాస్క్ ఫోర్స్ స్టేషన్  సిఐ శంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా తరపర చేస్తున్న ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి నవీన్ చంద్ర ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో ఆర్టిసి బస్సు పై అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వకీల్ యాదవ్ వ్యక్తిపై అనుమానం వచ్చింది. దీంతో వకీల్ యాదవను విచారించగా తాను ఎండు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పకిల్ యాదవ్ పై కేసు నమోదు చేసి పట్టుబడిన ఎండు గంజాయిని ఒక మొబైల్ స్వాధీనం చేసుకొని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్కు తరలించినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీ తనిఖీలు ఎక్సైజ్ ఎస్సైలు హనుమంతు,  అనుదీప్,  సిబ్బంది తదితరులు ఉన్నారు