మేడిగడ్డలో ప్రభుత్వం కుట్రలు
బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్ నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచి మరో కుట్రకు తెర లేపిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే మరమ్మతులు చేస్తోందని ప్రజలు భావిస్తే అదేమీ పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వంపై నిందలు వేయడానికి ప్రయ త్నిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లా డుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి అడ్డదారుల్లో వెళుతూ ప్రజల సొమ్మును నిలువునా దోచుకుంటున్నారని వి రుచుకుపడ్డారు.
టెండర్లు గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం తన నిర్ణ యం మార్చుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిం చా రు. రైతులకు నీరు ఇచ్చేందుకు శ్రద్ధలేదని, ఇసుకను తరలించే ప్రణాళిక లు కాంగ్రెస్ నేతలు అమలు చేస్తు న్నారని, పూర్తిగా ఇసుక దందాలో కూరకుపోయారని విమర్శించారు. సింగరేణి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, గనులు సిం గరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమి టో చెప్పాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒకటై సింగరేణి గనులను ప్రైవే టు పరం చేయాలని కుట్ర పన్నారని, ఈనెల 21న దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాకులు వేలం వేస్తారని తమ కు సమాచారం ఉందని, ఇందులో సింగరేణి బ్లాకులు ఉన్నాయని అనుమానం కలుగుతుందన్నారు. ఆదిలా బాద్ జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపురాయి గనులు, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కేటాయించేలా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు. నీట్ పరీక్షపై సీఎం రేవంత్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అన్నదమ్ముల మాదిరి తెలంగాణ గనులను ప్రైవేటుకు ధారదత్తం చేయాలని పథకం వేశారని విమర్శించారు.






