రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
రాష్ట్ర ఖనిజ అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఈరవతి అనిల్
నిర్మల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణీంచుకోలేక ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర ఖనిజ అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఈరవతి అనిల్ ద్వజమెత్తారు. శనివారం నిర్మల్ జిల్లా మామాడ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన సంబరాల్లో పాల్గొన్నారు. రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం చిత్రపటంకు పాలాభిఫేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు మహలక్ష్మీ పథకం ద్వారా ఉచిత ప్రయాణం వరి ధాన్యం రైతులకు బొనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కేసీఆర్ పాలన దాచుకోవడం, దోచుకోవడం జరిగిందని తమ పాలన ప్రజాపాలన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శ్రీహారిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు భీంరెడ్డి, ఆది, స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.




