5 April, 2026 | 11:33 PM

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహాన పెంచాలి

07-12-2024 07:52 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...

నిర్మల్ (విజయక్రాంతి): గ్రామీణ పట్టణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఆర్థిక అక్షరాస్యత సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం జిల్లాలోని కడెం మండల కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యతపై ఏర్పాటు చేసిన అవగాహాన సదస్సులో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. చదువు ప్రాదాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని దీని వల్ల అక్షరాస్యత పెరిగితే ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారని అన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చదవడం వ్రాయడం నేర్చుకోవాలని సూచించారు. అక్షరాస్యత పెంచెందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు వివరించారు. తమ పిల్లలను తప్పని సరిగా చదివించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్, అధికారులు పాల్గొన్నారు.