4 April, 2026 | 3:56 PM

Breaking News

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా   •   ప్రముఖ రచయిత్రి స్వర్ణ కిలారికి గూడూరి సీతారాం పురస్కారం   •   సురక్షిత సమాజం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు   •   సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి   •   మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •  

ఆఫీసులోనే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

27-09-2024 01:08 AM

గద్వాల (వనపర్తి), సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): జిల్లా కేం ద్రంలోని కేఎల్‌ఐ క్యాంప్‌లోని డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నంబర్ 1 కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్ తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన అశోక్‌కు మార్(41) పెబ్బేర్ పీజేపీ కార్యాలయం ఈఈ డివిజన్ 1లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. ఇటీవల గద్వాల పీజేపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. గురువారం ఉదయం పీజేపీ కార్యాలయ గది తెరవడానికి వచ్చిన అటెండర్‌కు అశోక్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు, గద్వాల టౌన్ పోలీసులు, ఇరిగేషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.