calender_icon.png 26 January, 2026 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుపై గుడ్డెలుగు దాడి

27-09-2024 01:09:26 AM

నిర్మల్, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం అడవి సారంగపూర్ గ్రామంలో బుధవారం రాత్రి గుడ్డెలుగు దాడిలో గిరిజన రైతు సోనేరావుకు తీవ్రగాయాలయ్యాయి. సోనేరావుకు రైతుకు చెందిన పశువు అడవిలో తప్పిపోవడంతో దాన్ని వెతుకుతుండగా పొదల్లో ఉన్న ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. కేకలు వేస్తూ దాని నుంచి తప్పించుకున్నాడు. గాయాలతో ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.